వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ పూర్తి..! 19 h ago
తిరుపతి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ పూర్తి అయ్యింది. తొలి మూడురోజులలో లక్షా 20 వేల టోకెన్లు జారీచేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో 3 రోజులకు లక్షా 20 వేల టోకెన్లను జారీ చేసింది. కోటా పూర్తవడంతో కౌంటర్లు మూసివేసింది. రోజుకు 40 వేల చొప్పున టీటీడీ టోకెన్లు జారీ చేసింది. 13వ తేదీ నుంచి టీటీడీ తిరిగి టోకెన్లు జారీచేయనుంది.